Krishnavamsi: డబ్బుకోసం నేను ఇండస్ట్రీకి రాలేదు: కృష్ణవంశీ

Krishnavamshi Interview
  • కృష్ణవంశీ తాజా చిత్రంగా రూపొందిన 'రంగమార్తాండ'
  • అవకాశాలు అడిగే అలవాటు లేదంటూ వ్యాఖ్య 
  • డబ్బు గురించిన ఆలోచన చేయనని వివరణ 
  • 'సిందూరం' వలన నష్టాలు వచ్చాయన్న కృష్ణవంశీ

కృష్ణవంశీ అనే పేరు వినగానే ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్లు కళ్లముందు కదలాడతాయి. త్వరలో ఆయన 'రంగమార్తాండ' సినిమాతో ఆడియన్స్ ను పలకరించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. తాను ఎప్పుడూ కూడా కథనే నమ్ముతాననీ, అది ఎవరికి సెట్ అయితే వాళ్లతోనే తీస్తాననీ చెప్పారు. 

"స్టార్ హీరోలందరితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అయినా నాకు అవకాశం ఇవ్వమని నేను ఎవరినీ అడగను. నేను తారసపడినప్పుడు 'ఎప్పుడు చేద్దాం సార్' అని వాళ్లే అడుగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా నేను వేరు .. ఆడియన్స్ వేరు అనుకోను. నేనేమీ పై నుంచి ఊడిపడలేదు. వాళ్లకి కావలసిన సినిమాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. 

'సిందూరం' కథను చేయడానికి వేరే నిర్మాతలు వెనకడుగు వేస్తే .. నా సొంత డబ్బులతో తీశాను. ఆ సినిమా నష్టాలు తెచ్చిపెట్టింది. అయినా నేను బాధపడలేదు .. ఎందుకంటే నేను డబ్బు కోసం ఇండస్ట్రీకి రాలేదు. డబ్బు గురించే ఆలోచన చేసుంటే నేను ఒక 'అంతఃపురం' .. ' ఖడ్గం' .. మహాత్మ' చేయలేకపోయేవాడిని. 'రంగమార్తాండ' కూడా ఆ కోవలోకే వస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News