YSRCP: పచ్చబొట్టు పొడిపించుకున్న జగన్ అభిమాని టీడీపీలో చేరిక

Young man who loved jagan joins in TDP
  • జగన్ అంటే ఎనలేని గౌరవం
  • గతంలో జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్న రమేశ్ 
  • బంధువులు, స్నేహితులతో కలిసి టీడీపీలో చేరిన వైనం
ముఖ్యమంత్రి జగన్‌కు వీరాభిమాని అయిన ఓ యువకుడు నిన్న తెలుగుదేశం పార్టీలో చేరాడు. శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా వలేటివారిపాలెం మండలంలోని చుండికి చెందిన ముతకని రమేశ్ ‌కు జగన్‌ అంటే చెప్పలేనంత అభిమానం.

వైసీపీ ఆవిర్భావం సమయంలో జగన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుతూ కుడిచేతిపై జగన్ పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అయితే, ఇప్పుడు మనసు మార్చుకుని టీడీపీలో చేరాడు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రమేశ్ తన బంధువులు, స్నేహితులతో కలిసి టీడీపీలో చేరాడు.
YSRCP
TDP
Sri Potti Sriramulu Nellore District

More Telugu News