Suryakumar Yadav: సూర్యకుమార్ మెరుపు శతకం వృథా... చివరి టీ20లో టీమిండియా ఓటమి

Suryakumar Yadav century went in vein as Team India loses third T20
  • నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ విజయం
  • టీమిండియా టార్గెట్ 216 రన్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసిన టీమిండియా
  • 55 బంతుల్లో 117 పరుగులు చేసిన సూర్యకుమార్
నాటింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. 216 పరుగుల లక్ష్యఛేదనలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక సెంచరీ సాధించినా ఫలితం దక్కలేదు. టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. విజయానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సూర్యకుమార్ అవుట్ కావడం భారత్ అవకాశాలను దెబ్బతీసింది. సూర్యకుమార్ కేవలం 55 బంతుల్లోనే 117 పరుగులు చేయడం విశేషం. అతడి స్కోరులో 14 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. 

శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 11, కోహ్లీ 11 పరుగులు చేయగా, పంత్ (1), దినేశ్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే 3, డేవిడ్ విల్లీ 2, క్రిస్ జోర్డాన్ 2, గ్లీసన్ 1, మొయిన్ అలీ 1 వికెట్ తీశారు. 

కాగా, ఇప్పటికే సిరీస్ ను టీమిండియా గెలుచుకున్న నేపథ్యంలో, ఈ విజయం ఇంగ్లండ్ కు ఊరట అని చెప్పాలి. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జులై 12న ప్రారంభం కానుంది.
Suryakumar Yadav
Century
Team India
England

More Telugu News