Vijayashanti: ఇండియా మొత్తం వెదికినా ఇలాంటి ఆణిముత్యం వంటి సీఎం దొరకడు: కేసీఆర్ పై విజయశాంతి సెటైర్లు

Vijayasanthi satires on CM KCR
  • సుదీర్ఘ సమయం పాటు కేసీఆర్ ప్రెస్ మీట్
  • విమర్శనాస్త్రాలు సంధించిన విజయశాంతి
  • ప్రజలు చస్తుంటే రాజకీయాలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం
  • కేసీఆర్ మహాత్మాగాంధీతో సమానం అంటూ వ్యంగ్యం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సుదీర్ఘ సమయం పాటు మీడియా సమావేశం జరిపి కేంద్రంపైనా, మోదీపైనా నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి విమర్శనాస్త్రాలు సంధించారు. భారీ వర్షాలతో తెలంగాణ జనం చస్తుంటే రాష్ట్ర యంత్రాంగాన్ని నడిపించడం మానేసి రెండు గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు మాట్లాడడం ఈ పెద్దమనిషికే చెల్లిందని విమర్శించారు. ఇండియా మొత్తం వెదికినా ఇటువంటి ఆణిముత్యంలాంటి సీఎం దొరకడని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ గారు గాంధీ మహాత్మునితో సమానం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తాను ఆచరించేదే ఎదుటివాళ్లకు చెప్పాలన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఏనాడూ ఇల్లు కదలని కేసీఆర్, ఇప్పుడు ప్రజలను కూడా ఇల్లు కదలొద్దంటున్నాడని సెటైర్ విసిరారు. తన పాలనలో లోపాలు బయటపడినప్పుడు ఇలా ఓ ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై బురదజల్లడం కేసీఆర్ కు అలవాటేనని విజయశాంతి పేర్కొన్నారు.
Vijayashanti
KCR
Press Meet
Telangana

More Telugu News