'లడ్కీ' చిత్రానికి నా కాలేజీ రోజుల్లోనే బీజం పడింది: వర్మ

  • పూజా భలేకర్ ప్రధానపాత్రలో 'లడ్కీ'
  • మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వర్మ కొత్త చిత్రం
  • బ్రూస్ లీ చిత్రాలు ఎక్కువగా చూసేవాడ్నన్న వర్మ
  • తాను కూడా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీసు చేసినట్టు వెల్లడి
RGV tells about his new movie Ladki

మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు పూజా భలేకర్ ప్రధానపాత్రలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'లడ్కీ'. గాళ్ డ్రాగన్ అనేది క్యాప్షన్. కాగా ఈ చిత్రం జులై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. కాగా, ఈ సినిమాపై వర్మ ట్విట్టర్ లో స్పందించారు. 

'లడ్కీ' చిత్రానికి తాను కాలేజీలో చదివే రోజుల్లోనే బీజం పడిందని వెల్లడించారు. ఆ సమయంలో తాను ఎక్కువగా బ్రూస్ లీ చిత్రాలే చూసేవాడ్నని, తాను కూడా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడ్నని వర్మ వివరించారు. అంతేకాదు, ఒంటిపై చొక్కా లేకుండా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీసు చేస్తున్న ఫొటోను కూడా పంచుకున్నారు.

More Telugu News