Anam Venkata Ramana Reddy: విజయసాయి విషపు మద్యం తయారుచేస్తున్నారు: ఆనం వెంకటరమణారెడ్డి

Anam Venkata Ramana Reddy slams Vijayasai Reddy
  • విజయసాయిపై ఆనం ఆరోపణలు
  • ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం
  • డిస్టిలరీలు సబ్ లీజుకు తీసుకుంటున్నారని వివరణ
  • 19 కంపెనీలు ఒకే చిరునామాతో ఉన్నాయని వెల్లడి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి విషపు మద్యం తయారుచేస్తున్నారని ఆరోపించారు. డిస్టిలరీల సబ్ లీజు ద్వారా విషపు మద్యం తయారీ చేపడుతున్నారని వివరించారు. విజయసాయిరెడ్డి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. 

హైదరాబాదులో 19 కంపెనీలు ఒకే చిరునామాతో ఉన్నాయని వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆయా కంపెనీల్లో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ డైరెక్టర్ గా ఉన్నాడని వెల్లడించారు. అవి జగన్, విజయసాయిల సూట్ కేసు కంపెనీలేనని ఆరోపించారు. రోహిత్ కంపెనీలో అదాన్ డిస్టిలరీస్ డైరెక్టర్ శ్రీనివాస్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. 2019లో అదాన్ డిస్టిలరీకి ఎవరు అనుమతిచ్చారని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో రూ.2,400 కోట్ల మద్యం ఎలా అమ్మారని నిలదీశారు.

  • Loading...

More Telugu News