CM Jagan: మీ మద్దతుకు, మీ ఆత్మీతయకు నా సెల్యూట్: సీఎం జగన్

CM Jagan thanked party cadre and fans
  • ముగిసిన వైసీపీ ప్లీనరీ
  • ప్లీనరీ విజయవంతమైందన్న వైసీపీ వర్గాలు
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
  • ప్లీనరీ జనసంద్రంలా మారిందని వెల్లడి

వైసీపీ ప్లీనరీకి కార్యకర్తల నుంచి, అభిమానుల నుంచి విశేష రీతిలో ఆదరణ లభించడం పట్ల సీఎం జగన్ సంతోషంతో పొంగిపోతున్నారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండ్రోజుల పాటు సాగిన వైసీపీ ప్లీనరీ విజయవంతం కావడం పట్ల ఆయన ట్విట్టర్ లో స్పందించారు. 

నిరంతరం దేవుడి దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల హృదయాలు... ఇవే తనకు శాశ్వత అనుబంధాలు అని పేర్కొన్నారు. ప్లీనరీ... కార్యకర్తలు, అభిమానుల సంద్రంలా మారిందని తెలిపారు. "చెక్కు చెదరని మీ ఆత్మీయతలకు, మనందరి పార్టీకి, ప్రభుత్వానికి మీ మద్దతుకు మరోసారి మీ జగన్ సెల్యూట్" అంటూ వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News