sleep: ఈ సంకేతాలు మీకు నిద్ర చాలడం లేదని చెప్పడమే.. !

  • ఆల్కహాల్ పెరిగినా, స్వీట్స్ తింటున్నా సంకేతాలే
  • వ్యాధులపై పోరాటానికి కంటినిండా నిద్ర కావాల్సిందే
  • కనీసం 7-9 గంటలు అవసరం
signs that indicate you need to sleep more

నిద్ర ఆరోగ్యానికి కీలకమైన సాధనం. సరిపడా నిద్ర లేకపోతే ఎన్నో సమస్యలకు తోడు, వ్యాధి నిరోధక శక్తి బలహీనపడిపోతుంది. దాంతో ఎన్నో వైరస్ లకు, బ్యాక్టీరియాకు మన శరీరం షెల్టర్ గా మారిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

ఉదయం 9 గంటలు దాటినా మంచం దిగడానికి కష్టంగా అనిపిస్తుందా..? కార్యాలయానికి వెళ్లి సీటులో కూర్చోగానే అలసి పోయినట్టుగా ఉంటోందా? నిద్ర చాలలేదనడానికి సంకేతాలుగానే వీటిని చూడాలి. రోజులో కనీసం 7-9 గంటల పాటు నిద్రపోయే వారు ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా పనిలో ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేని వారు నిద్రకు అయినా తగినంత సమయం వెచ్చిస్తున్నారా? అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ వ్యక్తి అయినా ముందు తనకు తాను న్యాయం చేసుకోవాలని అనుకుంటే కనీసం 8 గంటలు అయినా నిద్ర పోవాల్సిందే. 

ఏదో ఒకటి తింటూ ఉన్నారా..? ఎక్కువ స్నాక్స్, స్వీట్స్ ఇతర అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోవాలని అనిపిస్తోందా? అయితే నిద్ర చాల్లేదు అని చెప్పడానికి ఇవి సంకేతాలుగానే భావించాలి. అప్పుడు నిద్ర సమయం పెంచి చూడాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోయి, పొద్దున నిద్ర లేవడానికి సమస్యలు ఎదుర్కొంటున్నా.. సంకేతంగానే చూడాలి. నిద్ర సరిపడా పోకపోతే నీరు కూడా ఎక్కువ తీసుకోలేరు. ఎక్కువ కాఫీలు తాగాల్సి వస్తున్నా కానీ నిద్ర చాలడం లేదనే భావించాలి. ఇక తరచూ ఆల్కహాల్ తీసుకోవాల్సి వస్తుంటే అది కూడా నిద్రలేమికి సంకేతంగానే భావించాలి. కనుక వీటిల్లో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెళ్లి చికిత్స తీసుకోవాలి.

More Telugu News