Telangana: తెలంగాణలో రెడ్ అలెర్ట్ జారీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

  • పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • ప్రాజెక్టులకు భారీగా వరద
Red Alert For Telangana

వచ్చే 48 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొత్తగూడెంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

ఆల్మట్టి జలాశయంలో శుక్ర-శనివారాల మధ్య 24 గంటల్లో 6 టీఎంసీల మేర నిల్వ పెరిగింది. అలాగే, తుంగభద్ర డ్యాంలో 8 టీఎంసీ నిల్వ పెరిగింది. శ్రీరామసాగర్‌లోకి శుక్రవారం 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా శనివారానికి అది 1.25 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 39.20 టీఎంసీల నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 70 వేల క్యూసెక్కులను గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

More Telugu News