Gautam Adani: టెలికాం రంగంలోకి అడుగుపెట్టనున్న అదానీ.. అంబానీతో ముఖాముఖి పోటీ!

Gautam Adani enters Telecom sector
  • స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసిన అదానీ గ్రూప్
  • జులై 26న ప్రారంభం కానున్న వేలం ప్రక్రియ
  • వ్యాపారంలో తొలిసారి పోటీ పడుతున్న అంబానీ, అదానీ

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ టెలికాం రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసింది. వేలం ప్రక్రియ కోసం రిలయన్స్ జియో, వొడాఫోన్, ఎయిర్ టెల్ తో పాటు అదానీ గ్రూపు దరఖాస్తు చేసుకుంది. రూ. 4.3 లక్షల కోట్ల విలువైన 72,097.85 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ వేలం జులై 26న ప్రారంభమవుతుంది. 

నేషనల్ లాంగ్ డిస్టెన్స్, ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ లైసెన్సులను ఇటీవలే అదానీ గ్రూప్ పొందింది. మరోవైపు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీతో అదానీ ముఖాముఖి తలపడుతున్న సందర్భం ఇదే తొలిసారి. వీరిద్దరికీ వేర్వేరు వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు టెలికాం రంగంలో వీరిద్దరూ పోటీ పడబోతున్నారు.

  • Loading...

More Telugu News