Amartya Sen: నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ కు కరోనా పాజిటివ్

Amartya Sen tests positive for Corona
  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమర్త్యసేన్
  • కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ
  • సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లిపోయిన నోబెల్ గ్రహీత
ఇండియాలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో కొవిడ్ టెస్టులు చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. 

దీంతో ఆయన తన నివాసంలోనే సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇంటి వద్దే ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అమర్త్యసేన్ త్వరగా కోలుకోవాలని ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
Amartya Sen
Corona Virus
Positive

More Telugu News