Gotabaya Rajapaksa: ఇంటి నుంచి పరారైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స

Sri Lanka president Gotabaya Rajapaksa flees from hsi residence
  • మరోసారి రణరంగాన్ని తలపిస్తున్న శ్రీలంక
  • రాజీనామా చేయాలంటూ గొటబాయ నివాసంలోకి చొక్కుకుపోయిన ఆందోళనకారులు
  • అధ్యక్షుడు సురక్షితంగా వెళ్లిపోయారన్న అధికారి
సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన సోదరుడు, దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన అధికారిక నివాసం నుంచి పరారయ్యారు. 

గొటబాయ రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. ఎంతో భద్రత ఉండే ఆయన నివాసంలోకి దూసుకెళ్లారు. దీంతో, ఆయన తన నివాసం నుంచి వెళ్లిపోయారు. గొటబాయ రాజపక్స సురక్షితంగా అక్కడి నుంచి వెళ్లిపోయారని రక్షణశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. 

గత కొన్ని నెలలుగా ఆహారం, ఇంధన సమస్యతో శ్రీలంక అట్టుడుకుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.
Gotabaya Rajapaksa
Sri Lanka

More Telugu News