Akhil: 'వకీల్ సాబ్' డైరెక్టర్ తో అఖిల్ మూవీ!

Akhil in Dil Raju movie
  • 'ఏజెంట్'గా పలకరించనున్న అఖిల్
  • సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది  
  • ఆగస్టు 12వ తేదీన థియేటర్లలో విడుదల 
  • లైన్లో వేణు శ్రీరామ్ .. 'బొమ్మరిల్లు' భాస్కర్ 

అఖిల్ తాజా చిత్రంగా 'ఏజెంట్' రూపొందింది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన టేకింగ్ చాలా స్టైలీష్ గా .. డిఫరెంట్ గా ఉంటుంది. అందువలన అఖిల్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా తరువాత ఆఖిల్ నెక్స్ట్ ప్రాజెక్టు ఏ దర్శకుడితో ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో 'వకీల్ సాబ్' దర్శకుడు వేణు శ్రీరామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ఇటీవల ఒక కథను వినిపించడం, కథ కొత్తగా ఉండటంతో అఖిల్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని చెబుతున్నారు. 

ఇక మరో వైపున అఖిల్ కి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో హాట్ వచ్చిన 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా ఆయనతో మరో ప్రాజెక్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రావలసి వుంది.

  • Loading...

More Telugu News