Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ బై చెప్పబోతున్న రవీంద్ర జడేజా?

Ravindra Jadeja coming out from CSK
  • ఈ ఏడాది సీఎస్కేకు కెప్టెన్ గా వ్యవహరించిన జడేజా
  • కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన జడ్డూ
  • ఇన్స్టాలో సీఎస్కే పోస్టులను తొలగిస్తున్న జడేజా

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా ఆ జట్టుకు గుడ్ బెప్పబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఒక బలమైన కారణం ఉంది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి సీఎస్కేకు చెందిన అన్ని పోస్టులను తొలగిస్తున్నాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యంతో జడేజాకి విభేదాలు తలెత్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ ఏడాది చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడంతో... రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. అయితే జడేజా నాయకత్వంలో ఎనిమిది మ్యాచుల్లో చెన్నై జట్టు కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. దీనికి తోడు ఆల్ రౌండర్ గా కూడా జడేజా విఫలమయ్యాడు. దీంతో, జట్టు పగ్గాలను మళ్లీ ధోనీకే అప్పగించారు. అది జరిగిన తర్వాత గాయం కారణంగా చెన్నై జట్టుకు దూరమయ్యాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో జడేజా కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. 116 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో, జడేజా పట్ల సీఎస్కే యాజమాన్యం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ జట్టుకు దూరం జరిగేందుకు జడేజా సిద్ధమయినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News