Lakshman: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీలోని వారే సిద్ధంగా ఉన్నారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

Kattappas in TRS party will collapse the state government says Lakshman
  • టీఆర్ఎస్ లో  చాలా మంది కట్టప్పలు ఉన్నారన్న లక్ష్మణ్ 
  • ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా కేసీఆర్ పాలన సాగుతోందని విమర్శ 
  • మోదీ ఛరిష్మా ముందు కేసీఆర్ సరితూగలేరని వ్యాఖ్య 
టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కట్టప్పలు ఉన్నారని... సమయాన్ని బట్టి వారంతా ఆ పార్టీ నుంచి బయటకు వస్తారని బీజేపీ రాజ్యసభ సభ్యడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని... అందువల్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆ పార్టీలోని కట్టప్పలు అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. వీరి వెనుక బీజేపీ హస్తం లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తుల కారణంగానే వారు బయటకు వస్తారని అన్నారు. 

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం ట్రైలర్ మాత్రమేనని... అసలు సినిమా ముందుందని లక్ష్మణ్ చెప్పారు. ప్రధాని మోదీ ఛరిష్మా ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సరితూగలేరని... అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుట్రలు తెలంగాణలో పని చేయవని అన్నారు. జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. 
Lakshman
BJP
KCR
TRS
Narendra Modi

More Telugu News