Sourav Ganguly: బర్త్ డే సెలబ్రేషన్స్.. లండన్ వీధుల్లో భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన గంగూలీ: వీడియో ఇదిగో

Sourav Ganguly dances with family in the streets of London
  • లండన్ రెస్టారెంట్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్
  • సచిన్, జై షా వంటి వారి మధ్య వేడుకలు
  • లండన్ వీధుల్లో బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులు
టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ నిన్న తన 50వ బర్త్ డే వేడుకలను లండన్‌లో ఘనంగా జరుపుకున్నాడు.  జై షా, సచిన్ టెండూల్కర్ వంటి వారితో కలిసి లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో ‘దాదా’ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. గంగూలీ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు, తాజా, మాజీ క్రికెటర్లు చేసిన శుభాకాంక్షల పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. 

ఒకప్పటి అతడి టీమ్మేట్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ ద్వారా గంగూలీకి విషెస్ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే దాదా. నువ్వో గొప్ప స్నేహితుడివి. నువ్వో ప్రభావవంతమైన కెప్టెన్‌వి. సీనియర్ కానీ, జూనియర్ కానీ ఎవరైనా సరే నీ నుంచి నేర్చుకోవాలని అనుకుంటారు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ప్రేమ పూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశాడు.

తన బర్త్ డే సందర్భంగా లండన్ వీధుల్లో గంగూలీ కొత్త అవతారంలో దర్శనమిచ్చాడు. బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా కనిపించాడు. అతడి చుట్టూ ఉన్న వారు కూడా సంతోషంగా చిందులు వేస్తూ కనిపించారు.  కుమార్తె సనా గంగూలీ, భార్య డోనా కూడా స్టెప్పులు వేసి అలరించారు. ఈ స్వీట్ మూమెంట్‌కు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతోంది.
Sourav Ganguly
BCCI
Team India
London
Birthday

More Telugu News