Joe Biden: అమెరికన్ మహిళలకు బైడెన్ శుభవార్త.. గర్భస్రావ హక్కును కాపాడే ఉత్తర్వులపై సంతకం

Biden Moves To  Protect Patient Privacy After US Abortion Ruling
  • గర్భస్రావ హక్కును రెండు వారాల క్రితం రద్దు చేసిన అమెరికన్ సుప్రీంకోర్టు
  • కోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా మహిళల ఆందోళన
  • తాజా నిర్ణయంతో పరిమిత ప్రయోజనం 
  • వేరే రాష్ట్రాలకు వెళ్లి గర్భస్రావం చేయించుకునే మహిళలకు అండగా ఉత్తర్వులు
రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకునేందుకు వారికి ఉన్న హక్కును కాపాడే పరిపాలన ఉత్తర్వులపై సంతకం చేశారు. బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మహిళల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గర్భస్రావ హక్కును రెండు వారాల క్రితం అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. 

ఈ నేపథ్యంలో ఆ హక్కును పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సొంతపార్టీ అయిన డెమొక్రటిక్ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ ఉత్తర్వుల ద్వారా పరిమిత ప్రయోజనం మాత్రమే ఉంటుందని బైడెన్ పేర్కొన్నారు. అబార్షన్‌పై ఇప్పటికే 12 రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే యోచన చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వుల వల్ల పరిమిత ప్రయోజనం మాత్రమే ఉండే అవకాశం ఉంది. గర్భస్రావాన్ని సమ్మతించే రాష్ట్రాలకు వెళ్లి, అక్కడి సేవలను వినియోగించుకోవడంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాజా ఉత్తర్వులు రక్షణ కల్పిస్తాయి. అలాగే, గర్భస్రావ హక్కును కాపాడడంలో కోర్టులో పోరాటం మొదలుపెట్టాలని న్యాయ, ఆరోగ్య-మానవ సేవల శాఖను బైడెన్ ఆదేశించారు.
Joe Biden
Abortion
Supreme Court
Patient Privacy

More Telugu News