12 ఏళ్లలోపు చిన్నారులకు కొవాగ్జిన్, కొర్బెవ్యాక్స్ వినియోగానికి సిఫార్సు
- 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం కొర్బెవ్యాక్స్
- 6-12 ఏళ్లలోపు పిల్లల కోసం కొవాగ్జిన్ టీకా అభివద్ధి
- రెండు టీకాలను వినియోగించవచ్చంటూ నిపుణుల కమిటీ సిఫార్సు
6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ భారత్ బయోటెక్‌కు ఏప్రిల్ 26న అనుమతి మంజూరు చేసింది. అదే నెలలో డీసీజీఐ నిపుణుల ప్యానెల్ 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు వేసేందుకు బయోలాజికల్-ఇ కొర్బెవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతిని మంజూరు చేయాలని సిఫార్సు చేసింది.