వైఎస్సార్‌తో క‌లిసి ఉన్న‌ ఫొటోతో దివంగ‌త సీఎంకు నివాళి అర్పించిన కొండా ముర‌ళి

  • నేడు వైఎస్ జ‌యంతి వేడుక‌లు
  • దివంగ‌త సీఎంకు నివాళి అర్పించిన కొండా ముర‌ళి
  • వైఎస్సార్ సంక్షేమ ప‌థ‌కాల‌ను గుర్తు చేసుకున్న కాంగ్రెస్ నేత‌
konda murali tributes to ys rajasekhar reddy with a rare pgoto

దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని స్మ‌రించుకుంటూ తెలంగాణ‌కు చెందిన‌ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ కొండా ముర‌ళి ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. వైఎస్ బ‌తికుండ‌గా... ఆయ‌న‌తో తాను కిలిసి దిగిన ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసిన కొండా ముర‌ళి... దివంగ‌త సీఎంకు నివాళి అర్పించారు. 

ఈ సంద‌ర్భంగా వైఎస్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను ముర‌ళి గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌ను మ‌హానేత‌గా అభివ‌ర్ణించిన ముర‌ళి.. ఆరోగ్య శ్రీ, 108, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇల్లు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలతో పేదవాడి ఇంట్లో దేవుడై నిలిచార‌ని పేర్కొన్నారు.

More Telugu News