Bhuvneshwar Kumar: బట్లర్ ను భువనేశ్ ఎలో బోల్తా కొట్టించాడో వీడియో చూడండి..!

Bhuvneshwar Kumar produces magical in swinger to castle ENG captain Jos Buttler for golden duck in 1st T20I
  • తొలి ఓవర్లోనే మ్యాజిక్ చేసిన భువీ
  • లెగ్ స్టంప్ గా వచ్చిన బంతికి కొట్టే ప్రయత్నం చేసిన బట్లర్
  • చిక్కకుండా తప్పించుకుని పోయి వికెట్లను పడేసిన బాల్
ఇంగ్లండ్ -  భారత జట్టు మధ్య మొదటి టీ20లో ఆల్ రౌండర్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ లో సత్తా చూపించారు. బౌలింగ్ లో పాండ్యా, భువనేశ్వర్ కుమార్, చాహల్ మంచి ఫలితాలు రాబట్టారు. దీని ఫలితమే టీమిండియా ఘన విజయం. ఈ సందర్భంగా భువనేశ్ బౌలింగ్ గురించి చెప్పుకోవాల్సిందే.

ఇంగ్లండ్ పొట్టి క్రికెట్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ను గోల్డెన్ డకౌట్ చేశాడు. నిజానికి స్వింగ్ తో భువీ మాయ చేశాడనే చెప్పుకోవాలి. మొదటి ఓవర్ లో భువీ సంధించిన బంతిని బట్లర్ చాలా ఇంటెలిజెంట్ గా స్ట్రయిక్ చేయబోయాడు. లెగ్ స్టంప్ గా వచ్చిన బంతిని కొట్టబోగా.. అది బ్యాట్, కాలు మధ్య నుంచి మెలికలు తిరుగుతూ వెళ్లి వికెట్లను పడగొట్టేసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీని అందుకున్న తర్వాత బట్లర్ ఆడిన ఏడు మ్యాచుల్లో ఇది నాలుగో డకవుట్.

Bhuvneshwar Kumar
swinger
magical
Jos Buttler
golden duck

More Telugu News