Murali Mohan: చిరంజీవి 'గాడ్ ఫాదర్' లో తన లుక్ పై మురళీమోహన్ వివరణ

Murali Mohan explains about his look in Chiranjeevi God Father movie
  • మలయాళ లూసిఫర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్
  • మోహన్ రాజా దర్శకత్వంలో చిత్రం
  • కీలకపాత్రలో మురళీమోహన్
  • తన గెటప్ పై చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ చూపారని వెల్లడి
ప్రముఖ నటుడు మురళీ మోహన్ చాన్నాళ్ల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు. అది కూడా మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర, లుక్ పై మురళీమోహన్ స్పందించారు. ఈ సినిమాలో తన లుక్ పై చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ చూపించారని వెల్లడించారు. 

గాడ్ ఫాదర్ సినిమా తీస్తున్నామని చిరంజీవే స్వయంగా తనకు ఫోన్ చేశారని తెలిపారు. "ఫొటోలు పంపిస్తే దర్శకుడు మోహన్ రాజా చూస్తారని చిరంజీవి చెప్పారు. మా నాన్న చనిపోయినప్పుడు కొన్నాళ్లు తెల్ల జుట్టుతోనే ఉన్నాను.. ఆ ఫొటోలు పంపమని చిరంజీవి కోరారు. చిరంజీవి అడిగిన ఆ ఫొటోలు పంపాను. దర్శకుడు మోహన్ రాజా ఆ ఫొటోల్లో ఉన్న లుక్ బాగుందన్నారట. దాంతో చిరంజీవి సూచన మేరకు తెల్ల జుట్టు, గడ్డం పెంచాను" అని మురళీమోహన్ వివరణ ఇచ్చారు. అంతేకాదు, ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. 

మలయాళంలో హిట్టయిన లూసిఫర్ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తుండడం తెలిసిందే. ఈ చిత్రం దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండడం విశేషం. కాగా, చిరంజీవి, మురళీమోహన్ కలిసి నటించిన గ్యాంగ్ లీడర్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత కలిసి నటిస్తున్నారు.
Murali Mohan
Look
God Father
Chiranjeevi

More Telugu News