YSRCP: పార్క్‌లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా జ‌గ‌న్‌!

ys jagan leisure mode in ysr park in vempalle of kadapa district
  • క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో జ‌గ‌న్‌
  • వేంప‌ల్లెలో రూ.3 కోట్ల‌తో వైఎస్సార్‌ పార్క్ ఏర్పాటు
  • పార్క్‌ను ప్రారంభించి అందులో క‌లియ‌దిరిగిన జ‌గ‌న్‌
  • ఓపెన్ ఎయిర్ జిమ్ ప‌రిక‌రంపై నిల‌బ‌డి ఫొటోల‌కు పోజిచ్చిన వైనం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గురువారం త‌న సొంత జిల్లా క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా త‌న సొంత నియోజ‌కవ‌ర్గం పులివెందుల‌లో ఆయ‌న ప‌ర్య‌టించారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వేంప‌ల్లెలో రూ.3 కోట్ల‌తో అభివృద్ధి చేసిన వైఎస్సార్‌ పార్క్‌ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్క్‌లో క‌లియ‌దిరుగుతూ ఉత్సాహంగా క‌నిపించారు. 

ప్ర‌జ‌ల వ్యాయామం కోసం పార్కులో ఓపెన్ ఎయిర్ జిమ్ ప‌రిక‌రాల‌ను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిని జ‌గ‌న్ ఆస‌క్తిగా ప‌రిశీలిస్తూ సాగుతున్న క్రమంలో తనకు కనిపించిన స్కై వాకర్ వద్ద ఆగారు. దానిపై నిలబడిన జగన్ ఫొటోల‌కు పోజిచ్చారు. ఈ ఫొటోను ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా... అది వైర‌ల్‌గా మారింది.
YSRCP
YS Jagan
Kadapa District
Open Air Gym
YSR Park
Vempalle

More Telugu News