'అంటే సుందరానికీ' ఫైనల్ గా వచ్చింది ఎంతంటే .. !

07-07-2022 Thu 17:22
  • జూన్ 10న థియేటర్స్ కి వచ్చిన 'అంటే .. సుందరానికీ'
  • నాని జోడీగా పరిచయమైన నజ్రియా 
  • ఆశించిన స్థాయిలో లేని ఓపెనింగ్స్
  • ఓటీటీ కోసం రెడీ అవుతున్న సినిమా
Ante Sundaraniki movie update
నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ 'అంటే .. సుందరానికీ' సినిమాను రూపొందించాడు. కథానాయికగా నజ్రియాను తెలుగు తెరకి పరిచయం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, జూన్ 10వ తేదీన విడుదల చేశారు. కులాంతర వివాహం చేసుకోవడం కోసం ఒక జంట ఆడిన అబద్ధం ఎలాంటి పరిణామాలకి దారితీసిందనేది కథ.

వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, టైటిల్ దగ్గర నుంచి అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. టీజర్ కీ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో నానీకి మరో హిట్ పడటం ఖాయమని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ను తెచ్చుకోలేకపోయింది. ఆ తరువాత పుంజుకోలేకపోయింది.

ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఫైనల్ గా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలుపుకుని 14 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల షేర్ ను రాబట్టింది. త్వరలో ఓటీటీ లో రావడానికి రెడీ అవుతోంది. మరి ఓటీటీ సెంటర్ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.