షిండే శిబిరంలోకి వచ్చేసిన 66 మంది శివసేన థానే కార్పొరేటర్లు!

07-07-2022 Thu 16:47
  • షిండే దెబ్బకు ఇప్పటికే సీఎం పదవి కోల్పోయిన థాకరే
  • తాజాగా షిండే గూటికి చేరిన 66 మంది థానే కార్పొరేటర్లు
  • నిన్న వీరంతా షిండేను కలిసిన వైనం
66 Shiv Sena corporates jumps to Shende camp
ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్స్ కారణంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. బీజేపీ సహకారంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా షిండే అధికార పీఠంపై కూర్చున్నారు. ఈ పరిణామం నుంచి ఇంకా కోలుకోని థాకరేకు... మరో భారీ షాక్ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు షిండే గూటికి చేరిపోయారు. 

నిన్న రాత్రి వీరంతా షిండేను కలిశారు. షిండేకు పూర్తి మద్దతును ప్రకటించారు. ప్రస్తుతం థానే మున్సిపల్ కార్పొరేషన్ లో శివసేనకు కేవలం ఒక్క కార్పొరేటర్ మాత్రమే మిగిలి ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్రలో ముంబై తర్వాత అంతటి ప్రధానమైన మున్సిపల్ కార్పొరేషన్ థానే అనే విషయం గమనార్హం.