Airtel: ఎయిర్ టెల్ నుంచి నాలుగు చౌక ప్లాన్లు

  • రూ.109, రూ.111, రూ.128, రూ.131 ఆవిష్కరణ
  • 30 రోజులు, నెల రోజుల వ్యాలిడిటీ
  • తక్కువ వినియోగించుకునే కస్టమర్లే లక్ష్యం
Airtel launches 4 new affordable recharge plans in India

తక్కువగా వినియోగించే చిన్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ టెల్ నాలుగు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.109, రూ.111, రూ.128, రూ.131 ఇందులో ఉన్నాయి. 

రూ.109 ప్లాన్
ఈ ప్లాన్ 30 రోజుల కాల వ్యవధితో వస్తుంది. ఇందులో 200 ఎంబీ డేటా లభిస్తుంది. అలాగే, రూ.99 టాక్ టైమ్ కూడా వస్తుంది. నెల రోజుల పాటు ఈ డేటా, టాక్ టైమ్ అందుబాటులో ఉంటాయి. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్ లైన్ కు చేసుకునే వాయిస్ కాల్స్ కు ప్రతీ సెకన్ కు 2.5 పైసలు చార్జీ పడుతుంది. ప్రతి ఎస్ఎంఎస్ కు రూ.1 చార్జీ చెల్లించాలి. ఎస్టీడీ ఎస్ఎంఎస్ అయితే రూ.1.44 చార్జీ పడుతుంది.

రూ.111 ప్లాన్
109 ప్లాన్ లో మాదిరే ప్రయోజనాలు కూడా ఇందులో లభిస్తాయి. కాకపోతే రూ.109 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా.. రూ.111 ప్లాన్ నెల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. 

రూ.128 ప్లాన్ 
ఈ ప్లాన్ 30 రోజుల కాల వ్యవధితో వస్తుంది. ఈ ప్లాన్ లో ప్రతి సెకన్ కు చార్జీ 2.5 పైసలు పడుతుంది. అదే వీడియో కాల్ అయితే ప్రతి సెకన్ కు 5 పైసలు చార్జీ చెల్లించాలి. మొబైల్ డేటా ఒక ఎంబీకి 50 పైసలు చార్జీ పడుతుంది. లోకల్ ఎస్ఎంఎస్ కు రూపాయి, నేషనల్ ఎస్ఎంఎస్ కు రూ.1.50 చార్జీ చెల్లించాలి. 

రూ.131 ప్లాన్
ఈ ప్లాన్ గడువు నెల రోజులు. అంటే ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్ చేసుకుంటే చాలు. ఇందులో మిగిలిన చార్జీలన్నీ కూడా రూ.128 ప్లాన్ మాదిరే ఉంటాయి.

More Telugu News