ఇండియా పెరుగుతున్న కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

07-07-2022 Thu 12:16
  • గత 24 గంటల్లో 18,930 కరోనా కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14,650
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,457
Corona cases increasing in India
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4.38 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... 18,930 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతకు ముందు నమోదైన కేసుల సంఖ్య 16,159గా ఉండటం గమనార్హం. ఇదే సమయంలో 14,650 మంది కోలుకోగా... 35 మంది మృతి చెందారు. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,457కి పెరిగింది. 

ఇప్పటి వరకు దేశంలో 4,35,66,739 కేసులు నమోదయ్యాయి. 4,29,21,977 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,305 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.32 శాతంగా, రికవరీ రేటు 98.52 శాతంగా, క్రియాశీల రేటు 0.27 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 198 కోట్లకు పైగా డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు.