ధోనీ పట్ల అభిమానాన్ని చాటుకున్న సురేశ్ రైనా.. దిగ్గజాల శుభాకాంక్షలు

07-07-2022 Thu 11:40
  • పెద్దన్నయ్య అంటూ ప్రేమగా సంబోధించిన రైనా
  • అన్నివేళలా మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్
  • రత్నం లాంటి మనిషి అంటూ సెహ్వాగ్ ట్వీట్
  • బీసీసీఐ, సీఎస్కే సైతం శుభాకాంక్షలు
Happy Birthday MS Dhoni Suresh Raina leads wishes shares heartwarming note as former India captain turns 41
ప్రముఖ సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ 41వ పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు శుభాకాంక్షలతో తమ స్పందన తెలియజేశారు. ధోనీని అమితంగా ఇష్టపడే, అభిమానించే సురేశ్ రైనా కూడా శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నాడు.

‘‘నా పెద్దన్నయ్యకు హ్యాపీ బర్త్ డే అంటూ’’ సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. ధోనీతో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో ఓ షార్ట్ వీడియోను రూపొందించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘‘నా జీవితంలోని ప్రతి దశలోనూ మార్గదర్శిగా ఉన్న, నా అతిపెద్ద మద్దతుదారుడికి ధన్యవాదములు. ఆ దేవుడి ఆశీస్సులతో నీవు, నీ కుటుంబం ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యంతో ఉండాలి’’ అని రైనా ట్వీట్ పెట్టాడు. 

మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘‘ధోనీ క్రీజులో ఉన్నంత సేపూ మ్యాచ్ పూర్తి కాదు. ధోనీ వంటి వ్యక్తిని కలిగి ఉండే అదృష్టం అన్ని జట్లకు ఉండదు. రత్నం లాంటి మనిషి, ఆటగాడు అయిన ఎంఎస్ ధోనీకి హ్యాపీ బర్త్ డే. ఓమ్ హెలికాప్టరాయనమహ’’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ, ధోనీతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ధోనీ 'హెలికాఫ్టర్ షాట్' ప్రత్యేకత అందరికీ తెలిసిందే.. అందుకే, సెహ్వాగ్ అలా చమత్కరించాడు.

అటు బీసీసీఐ కూడా తన వంతుగా మోదీకి శుభాకాంక్షలు తెలియజేసింది. ఓ రూపం, ఓ స్ఫూర్తి అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ కు హ్యాపీ బర్త్ డే విషెస్ తో ట్వీట్ చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ సైతం ట్విట్టర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పింది.