యువ‌ న‌టుడితో స‌మంత బాలీవుడ్ ఎంట్రీ!

07-07-2022 Thu 08:02
  • ఆయుష్మాన్‌ ఖురానా స‌ర‌స‌న న‌టించ‌నున్న సమంత‌
  • ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో హిందీ జ‌నాల‌కు ద‌గ్గ‌రైన ద‌క్షిణాది న‌టి
  • ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి సినిమా చేస్తున్న సమంత‌
Samantha to make her Bollywood debut opposite Ayushmann Khurrana
తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగి, ద‌క్షిణాదిన స్టార్ డ‌మ్ తెచ్చుకున్న స‌మంత బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌బోతోంది. ఇప్ప‌టికే ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్ రెండో సీజన్‌, పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్‌తో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు స‌మంత చేరువైంది. దాంతో, బాలీవుడ్‌లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. ఆమె బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌తో తొలి సినిమా చేస్తుంద‌ని మొన్న‌టిదాకా ప్ర‌చారం జ‌రిగింది.  

తాజా స‌మాచారం మేర‌కు స‌మంత ఓ యువ హీరోతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నుంది. వైవిధ్య‌మైన చిత్రాల‌తో బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో సమంత హీరోయిన్‌గా బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దినేష్‌ విజయ్ నిర్మిస్తారని, ఇప్ప‌టికే స్ర్కిప్ట్ వ‌ర్క్ కూడా పూర్త‌యింద‌ని తెలుస్తోంది. 

స‌మంత డేట్స్ కూడా ఇవ్వ‌డంతో షూటింగ్‌ షెడ్యూల్స్‌ చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం నడుస్తోంది. మరోపక్క, సమంత, విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఖుషి మొదటి షెడ్యూల్‌ ముగిసింది.