Rajya Sabha: రాజ్య‌స‌భ‌కు 'బాహుబ‌లి' క‌థా ర‌చ‌యిత‌ విజయేంద్రప్రసాద్, ఇళయరాజా!

V Vijayendra Prasad nominated to rajyasabha in th president of india quota
  • రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన న‌లుగురు
  • పీటీ ఉష‌, వీరేంద్ర హోగ్డేల‌ను నామినేట్ చేసిన వైనం
  • రాష్ట్రప‌తి కోటాలో ఈ న‌లుగురి ఎంపిక‌
తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత వి. విజ‌యేంద్ర ప్రసాద్ రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. రాష్ట్రప‌తి కోటాలో ప‌లు రంగాల‌కు చెందిన న‌లుగురిని నామినేట్ చేస్తూ న‌రేంద్ర మోదీ స‌ర్కారు బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ జాబితాలో విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో పాటు ప్రముఖ సినీ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా, ప‌రుగుల రాణి పీటి ఉష‌, వీరేంద్ర హెగ్డేల‌ను ఎన్డీఏ స‌ర్కారు రాజ్య‌స‌భకు నామినేట్ చేసింది.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ... విజ‌యేంద్ర ప్ర‌సాద్ సినీ రంగానికి చేసిన కృషిని కీర్తించారు. ద‌శాబ్దాలుగా సినీ రంగానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ సేవ‌లందిస్తున్నార‌ని మోదీ పేర్కొన్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ చేసిన కృషి వ‌ల్ల భార‌త సంస్కృతి విశ్వవ్యాప్త‌మైంద‌ని కూడా మోదీ తెలిపారు.
Rajya Sabha
President Of India
Prime Minister
Narendra Modi
V. Vijayendra Prasad
PT Usha
Ilayaraja

More Telugu News