ఆసుప‌త్రి బెడ్‌పై అచేతనావ‌స్థ‌లో లాలూ!... అలా చూస్తూ నిలుచుండిపోయిన నితీశ్!

06-07-2022 Wed 18:58
  • మంగ‌ళ‌వారం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన లాలూ
  • పాట్నాలోని ప‌రాస్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న వైనం
  • ఆసుప‌త్రికి వెళ్లి లాలూను చూసొచ్చిన నితీశ్ కుమార్‌
bihar cm Nitish Kumar visited Lalu Prasad Yadav in the hospital
బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తీవ్ర అనారోగ్యానికి గురైన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యానికి త‌ర‌చూ గుర‌వుతున్న లాలూను ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రుల చుట్టూ తిప్పుతున్నారు. తాజాగా మంగ‌ళ‌వారం తీవ్ర అనారోగ్యానికి గురైన లాలూ పాట్నాలోని ప‌రాస్ ఆసుప‌త్రిలో చేరారు. ఆసుప‌త్రి వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అంద‌జేస్తున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న బీహార్ ముఖ్య‌మంత్రి, జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీశ్ కుమార్ బుధ‌వారం ప‌రాస్ ఆసుప‌త్రికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆసుప‌త్రి బెడ్‌పై అచేత‌నంగా ప‌డుకున్న లాలూను ఆయ‌న అలా చూస్తూ నిల‌బ‌డిపోయారు.