అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'లక్కీ లక్ష్మణ్' ఫస్ట్ లుక్ రిలీజ్!

06-07-2022 Wed 18:55
  • సోహైల్ హీరోగా రూపొందిన 'లక్కీ లక్ష్మణ్'
  • దర్శకుడిగా అభి పరిచయం
  • కథానాయికగా మోక్ష 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు 
Lucky lakshman Movie Update
దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'లక్కీ లక్ష్మణ్'. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ చేశాడు. 

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ..  'లక్కీ లక్ష్మణ్' ఫస్ట్ లుక్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలకు ఇది మొదటి చిత్రమైనా చాలా చక్కగా తెరకెక్కించారు. వీరిద్దరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి. నటుడు సోహైల్ నాకు బిగ్ బాస్ నుండి తెలుసు .. తన నటన బాగుంటుంది. వీరి ముగ్గురు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నాడు. 

హీరో సొహైల్ మాట్లాడుతూ.. "అనిల్ రావిపూడి అన్న ఎంతో బిజీగా ఉన్నా మా 'లక్కీ లక్ష్మణ్' ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తను లాంచ్ చేయడంతో మా సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాము. మా దర్శక నిర్మాతలకు సినిమాపై ఎంతో ఫ్యాషన్ ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీనియర్ టెక్నీషియన్స్ తో నిర్మించారు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది" అని చెప్పాడు.

చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ, నటీ నటులు .. టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసుకునే వరకు రావడం ఆనందంగా ఉంది. నా ఫేవరెట్ డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడిగారి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం సంతోషంగా ఉంది. మా జనరేషన్ దర్శకులకు ఆయనే ఇన్స్పిరేషన్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది" అని అన్నాడు. 

చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ... "దర్శకుడు అనిల్ రావిపూడి గారు ఎంతో బిజీగా ఉన్నా, మేము అడిగిన వెంటనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది .. వారికి మా ధన్యవాదాలు. ఈ  సినిమా మోషన్ పోస్టర్ ను చూసిన చాలామంది ఇది చాలా క్రియేటివ్ గా ఉందని అనడం, మాకు ఎంతో ఎనర్జీని ఇచ్చినట్లు అయ్యింది. దర్శకుడు అభి ఎంతో ట్యాలెంటెడ్. తను చెప్పిన కథ నచ్చడమే కాకుండా .. తను పడే కష్టం .. తపన చూసి ఈ సినిమా చేస్తున్నాను" అన్నారు.