Corona Virus: బూస్ట‌ర్ డోస్ వ్య‌వ‌ధిని త‌గ్గిస్తూ కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

union government reduces booster dose time to 6 months from 9 months
  • ప్ర‌స్తుతం బూస్ట‌ర్ డోస్ వ్య‌వ‌ధి 9 నెల‌లు
  • 6 నెల‌ల‌కు కుదించాలంటూ ఎన్టీఏజీఐ సిఫార‌సు
  • ఎన్టీఏజీఐ సిఫార‌సు మేర‌కే వ్య‌వ‌ధిని త‌గ్గించిన కేంద్రం
కరోనా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ కోసం ఇస్తున్న బూస్ట‌ర్ డోస్ వ్య‌వ‌ధిని త‌గ్గిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం రెండు క‌రోనా వ్యాక్సిన్లు తీసుకున్న త‌ర్వాత 9 నెల‌ల‌కు బూస్ట‌ర్ డోస్‌ను వేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వ్య‌వ‌ధిని 6 నెల‌ల‌కు త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఇన్ ఇమ్మూనైజేష‌న్ (ఎన్టీఏజీఐ) సిఫార‌సుల మేర‌కు కేంద్రం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ప్రికాష‌న‌రీ డోస్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రికాష‌న‌రీ డోస్‌ల‌ను దేశ‌వ్యాప్తంగా ప్రైవేట్ కేంద్రాల్లోనే వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బూస్ట‌ర్ డోస్ వ్య‌వ‌ధిని త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ కేంద్రాల‌కు మ‌రింత మేర వ్యాక్సిన్ల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అడ్వైజ‌రీ జారీ చేసింది.
Corona Virus
Booster Dose
Vaccine
Union Government
NTAGI

More Telugu News