'రామారావు ఆన్ డ్యూటీ' నుంచి వేణు ఫస్టులుక్!

06-07-2022 Wed 18:22
  • రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'రామారావు ఆన్ డ్యూటీ'
  • కథానాయికలుగా దివ్యాన్ష, రజీషా
  • కీలకమైన పాత్రలో వేణు తొట్టెంపూడి 
  • ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల   
Ramarao On Duty movie update
రవితేజ తన కెరియర్ లో చాలామంది దర్శకులను  పరిచయం  చేశాడు. అలా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో ఆయన శరత్ మండవ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి రవితేజ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. 

ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఆ పాత్ర ఏమిటనేది మాత్రం బయటికి రాలేదు. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రను చేసినట్టుగా చెబుతూ .. సీఐ మురళి పాత్రలో ఆయన లుక్ ను పరిచయం చేస్తూ మేకర్స్ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను వదిలారు. 

కొంతకాలం క్రితం హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వేణు, సినిమాలను పక్కన పెట్టేసి చాలా కాలమైంది. ఈ సినిమాతో ఆయన రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. దివ్యాన్ష కౌషిక్ .. రజీషా విజయన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, అన్వేషి ఐటమ్ సాంగులో మెరవనుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.