బాలకృష్ణ 107వ సినిమా కోసం 'టర్కీ' వెళ్లనున్న టీమ్!

06-07-2022 Wed 17:45
  • షూటింగు దశలో బాలయ్య 107వ సినిమా 
  • మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగే కథ
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • దసరాకి  సినిమాను రిలీజ్ చేసే అవకాశం 
Balakrishna and Gopichand Malineni movie update
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కడా పెద్దగా గ్యాప్ లేకుండా షూటింగును చేస్తూ వెళుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమాకి సంబంధించిన కొంత షూటింగును అమెరికాలో జరపాలని అనుకున్నారు. కొన్ని కారణాల వలన అది కుదరకపోవడంతో 'టర్కీ'లో ప్లాన్ చేశారని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనున్నట్టు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలతో పాటు ఒకటి రెండు పాటలను కూడా అక్కడ చిత్రీకరించే అవకాశం ఉంది.

బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తుండగా, ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించనున్నాడు. 'అఖండ' సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించిన తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 'దసరా'కి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.