టాంజానియా అడవుల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్

06-07-2022 Wed 17:17
  • సెరంగేటి నేషనల్ పార్క్ లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న బన్నీ
  • ఫొటోనే షేర్ చేసిన స్నేహారెడ్డి
  • 'పుష్ప-2'కు లొకేషన్లను కూడా వెతుకుతున్నట్టు సమాచారం
Allu Arjun enjoying in Tanzania with family
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన.. మరోవైపు తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్లు ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా భార్య స్నేహారెడ్డి, కొడుకు అయిన్, కూతురు అర్హలు ఆఫ్రికా దేశమైన టాంజానియలో పర్యటిస్తున్నారు. టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్ లో వారు ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ఫొటోను స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. మరోవైపు 'పుష్ప' రెండో భాగం షూటింగ్ కు లొకేషన్లను కూడా బన్నీ వెతుకుతున్నట్టు తెలుస్తోంది. తనకు నచ్చిన లొకేషన్లను దర్శకుడు సుకుమార్ కు షేర్ చేస్తున్నట్టు సమాచారం.