'పొన్నియన్ సెల్వన్' నుంచి ఐశ్వర్యారాయ్ లుక్!

06-07-2022 Wed 17:17
  • మణిరత్నం నుంచి మరో భారీ చిత్రం 
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ 
  • నందిని పాత్రలో కనిపించనున్న ఐశ్వర్యరాయ్ 
  • సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల  
Ponniyan Selven Movie Update
మణిరత్నం నుంచి ఒక సినిమా వస్తుందంటే, అందులో ఏదో కొత్తదనం ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. టాక్ తో  సంబంధం లేకుండా ఆయన సినిమాలను తప్పకుండా చూడాలనుకునేవారు చాలామంది ఉన్నారు. అలాంటి మణిరత్నం నుంచి ఈ సారి ఒక చారిత్రక చిత్రం రానుంది .. ఆ సినిమాపేరే 'పొన్నియన్ సెల్వన్'.

లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిరత్నం కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. భారీ బడ్జెట్  తో .. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందింది. సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలెట్టారు. 

ఈ కథ చోళరాజుల కాలంలో నడుస్తుంది. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కీలకమైన పాత్రలో నటించింది. రీ ఎంట్రీ తరువాత ఆమె చేసిన భారీ సినిమా ఇది. ఆమె ఈ సినిమాలో 'నందిని' అనే పాత్రను పోషించిందనే విషయాన్ని తెలియజేస్తూ ఆమె లుక్ ను రిలీజ్ చేశారు. ఐశ్వర్య రాయ్ అదే గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉండటం విశేషం.