రెండు రోజుల కడప జిల్లా పర్యటనకు వెళుతున్న జగన్

06-07-2022 Wed 16:55
  • రేపు ఉదయం 11 గంటలకు పులివెందుల చేరుకోనున్న జగన్
  • పలు అభివృద్ధి పనుల్లో పాల్గొననున్న సీఎం
  • ఎల్లుండి ఇడుపులపాయలో వైయస్ కు నివాళి అర్పించనున్న జగన్
Jagan going to Kadapa district for two days
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు ఉదయం తాడేపల్లి లోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకుని... రెండు గంటల పాటు పులివెందుల మున్సిపాలిటీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 

ఇక మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు వేంపల్లికి చేరుకుంటారు. అక్కడ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. 

ఎల్లుండి ఉదయం 8 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకుని, ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. అనంతరం విజయవాడకు తిరుగుపయనమవుతారు.