భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

06-07-2022 Wed 16:34
  • 617 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 179 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4.54 శాతం పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ విలువ  
Markets ends in profits
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. చమురు ధరలు దిగి రావడం, వాహన విక్రయాలు పుంజుకోవడం, కమోడిటీ ధరలు తగ్గడం వంటివి ఇన్వెస్లర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 617 పాయింట్లు లాభపడి 53,751కి పెరిగింది. నిఫ్టీ 179 పాయింట్లు ఎగబాకి 15,990 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (4.54%), బజాజ్ ఫైనాన్స్ (4.51%), హిందుస్థాన్ యూనిలీవర్ (4.01%), మారుతి (3.48%), ఏసియన్ పెయింట్స్ (3.45%). 

టాప్ లూజర్స్: 
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.63%), ఎన్టీపీసీ (-1.03%), రిలయన్స్ (-0.87%), ఎల్ అండ్ టీ (-0.50%), టాటా స్టీల్ (-0.22%).