Team India: వెస్టిండిస్‌తో వ‌న్డే సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఇదే... కెప్టెన్‌గా గ‌బ్బ‌ర్ ఎంపిక‌

sikhar dhawan is the team india captain in the one day series against west indies
  • రోహిత్‌, కోహ్లీ, పాండ్యా, బుమ్రాల‌కు విశ్రాంతి
  • వైస్ కెప్టెన్‌గా ర‌వీంద్ర జ‌డేజా ఎంపిక‌
  • ఈ నెల 22 నుంచి 3 వ‌న్డేల సిరీస్ ప్రారంభం
వెస్టిండిస్ జ‌ట్టుతో ఈ నెల 22 నుంచి మొద‌లుకానున్న వ‌న్డే సిరీస్‌కు టీమిండియా జ‌ట్టును బీసీసీఐ బుధ‌వారం ప్ర‌క‌టించింది. జ‌ట్టు రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స‌హా విరాట్ కోహ్లీ, హార్దిక పాండ్యా, జ‌స్‌ప్రీత్ బుమ్రాల‌కు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. ఈ సిరీస్‌కు ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌ను కెప్టెన్‌గా ప్ర‌క‌టించింది. ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను వైస్ కెప్టెన్‌గా ప్ర‌క‌టించింది.

3 వ‌న్డే మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆడే భార‌త జ‌ట్టులో శిఖ‌ర్ ధావ‌న్‌, ర‌వీంద్ర జ‌డేజాల‌తో పాటు రుతురాజ్ గైక్వాడ్‌, శుభ్‌మ‌న్ గిల్‌, దీప‌క్ హుడా, సూర్య‌కుమార్ యాద‌వ్, శ్రేయాస్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌, సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌,  అక్ష‌ర్ ప‌టేల్‌, అవేశ్ ఖాన్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, అర్ష్ దీప్‌లను బీసీసీఐ ఎంపిక చేసింది.
Team India
BCCI
Shikhar Dhawan
Ravindra Jadeja
West Indies

More Telugu News