శ‌బ‌రిమ‌ల ఆలయంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన కనకదుర్గ ఇప్పుడు రెండో వివాహం చేసుకుంది!

  • 2019లో శబరిమల ఆలయంలోకి వెళ్లిన కనకదుర్గ, లాయర్ బిందు
  • అదే ఏడాది భర్తతో విడాకులు తీసుకున్న కనకదుర్గ
  • కామ్రేడ్ శివన్ కుట్టిని రెండో వివాహం చేసుకున్న కనకదుర్గ
Kanakadurga who entered Sabarimal temple gets second marriage

కనకదుర్గ... 2019లో ఈమె పేరు మారుమోగింది. 2019 జనవరి 2న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లి.. సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఆమె ఒకరు. అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు కూడా ప్రవేశం ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.... లాయర్ బిందు అమ్మినితో కలిసి ఆమె అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక భద్రత మధ్య వీరు ఆలయంలోకి ప్రవేశించారు.

అయ్యప్ప ఆలయానికి వెళ్లొచ్చిన తర్వాత కనకదుర్గ ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో, అదే ఏడాది జూన్ లో ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో మావో సానుకూల అయ్యంకలి పద గ్రూపులో ఎంతో కాలంగా కామ్రేడ్ గా చేస్తున్న శివన్ కుట్టికి ఏడాది క్రితం ఆమె దగ్గరయింది. ఆ పరిచయం కాస్తా పెళ్లి వరకు దారి తీసింది. శివన్ కుట్టిని ఆమె తాజాగా పెళ్లాడింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వీరిద్దరూ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఇంతకాలం ఒంటరిగా జీవిస్తున్న తాము, ఇప్పుడు కలిసి జీవించాలనుకుంటున్నామని శివన్ కుట్టి తెలిపారు.

More Telugu News