తొలి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్ సాధించిన తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ విద్యార్థి

06-07-2022 Wed 15:28
  • ఎఫ్‌సీఆర్ఐలో చ‌దువుకున్న కాస‌ర్ల రాజు
  • ఐఎఫ్ఎస్ 2021 ప‌రీక్ష‌లో 86వ ర్యాంకు సాధించిన వైనం
  • అభినందించిన కేసీఆర్‌
fcri student kasarla raju selected to ifs in his first attempt
తెలంగాణ‌లోని సిద్దిపేట జిల్లా ప‌రిధిలోని ములుగు కేంద్రంగా ఏర్పాటైన ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్ఐ)కి చెందిన ఓ విద్యార్థి స‌త్తా చాటాడు. ఐఏఎస్‌, ఐపీఎస్ త‌ర‌హా సివిల్ స‌ర్వీసుల మాదిరే ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ (ఐఎఫ్ఎస్‌) పేరిట యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) ఏటా నిర్వ‌హస్తున్న ప‌రీక్ష‌ను తొలి య‌త్నంలోనే పాస‌య్యాడు. 

ఆల్ ఇండియా స‌ర్వీసుల కోసం అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసేందుకు నిర్వ‌హించే ఐఎఫ్ఎస్ ప‌రీక్ష‌కు ఎఫ్‌సీఆర్ఐలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న కాస‌ర్ల రాజు 2021లో రాశారు. త‌న తొలి య‌త్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో 86వ ర్యాంకు సాధించాడు. ఇటీవ‌లే ఈ ఫ‌లితాలు విడుద‌ల కాగా.. మంగ‌ళ‌వారం రాత్రి సీఎం కేసీఆర్‌ను ఆయ‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాజును కేసీఆర్ అభినందించారు.