రేపే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి... వ‌ధువు ఫొటో ఇదిగో!

06-07-2022 Wed 15:12
  • ఆరేళ్ల క్రితం తొలి భార్య‌కు విడాకులిచ్చిన మాన్‌
  • డాక్ట‌ర్ గుర్‌ప్రీత్ కౌర్‌ను రెండో పెళ్లి చేసుకుంటున్న వైనం
  • చండీగ‌ఢ్‌లో జ‌ర‌గ‌నున్న వేడు‌క‌కు హాజ‌రుకానున్న కేజ్రీవాల్‌
Punjab CM Bhagwant Mann will get married tomorrow with Gurpreet Kaur
ఇటీవ‌లే పంజాబ్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టిన ఆప్ నేత భ‌గ‌వంత్ మాన్ రెండో పెళ్లికి సిద్ధ‌మ‌య్యారు. రేపు ఆయ‌న త‌న రెండో వివాహాన్ని అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య చేసుకోనున్నారు. చండీగ‌ఢ్‌లోని త‌న నివాసంలో జ‌రిగే ఈ వివాహ వేడుక‌కు ఆప్ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స‌హా ప‌లువురు పార్టీ ముఖ్యులు హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం.

ఆప్ లో చేరిన త‌ర్వాత ఆరేళ్ల క్రిత‌మే భ‌గ‌వంత్ మాన్ త‌న మొద‌టి భార్య‌కు విడాకులు ఇచ్చారు. ఆరేళ్లుగా వివాహం అనే మాటే ఎత్త‌కుండా సాగిన భ‌గ‌వంత్ తాజాగా పంజాబ్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అన‌తి కాలంలోనే రెండో పెళ్లి చేసుకుంటూ ఉండ‌టం గ‌మ‌నార్హం. వైద్యురాలు అయిన డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ ను భగవంత్ రెండో వివాహం చేసుకోనున్నారు.
.