ఇకపై టిక్ టాక్ లో లైవ్ చూడాలంటే 18 ఏళ్లు నిండాల్సిందే!
- యాప్ లో మార్పులు చేస్తున్న టిక్ టాక్
- మైనర్లు అడల్ట్ కంటెంట్ చూడకుండా నిరోధించేందుకు చర్య
- భారత్ లో టిక్ టాక్ ను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈ పరీక్ష వ్యవధిలో ఎంపిక చేసిన వినియోగదారులు తమ ప్రత్యక్ష ప్రసారాన్ని పెద్దలకు మాత్రమే పరిమితం చేయడానికి ‘మెచ్యూర్ థీమ్‌లు’ బటన్ అనే ఆప్షన్ ఇచ్చారు. దీన్ని ఆన్ చేస్తే ‘18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వీక్షకులు మాత్రమే మీ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడగలరు’ అని తెరపై కనిపిస్తుందని టిక్ టాక్ చెబుతోంది.
వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసిన తర్వాత.. సదరు వీడియో 18 అని ట్యాగ్ చేయబడిందని స్క్రీన్ పై నోటిఫికేషన్ వస్తుంది. అంతకంటే తక్కవ వయసు ఉన్న వాళ్లు సదరు వీడియోలు చూడాలని ప్రయత్నిస్తే అవి కనిపించకుండా పోతాయని టిక్ టాక్ చెబుతోంది. కాగా, భారత్ లో టిక్ టాక్ సహా పలు చైనా యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.