hanged: మమ్మల్ని ఉరేస్తారా? జీవిత ఖైదు విధిస్తారా?... కన్హయ్యలాల్ హత్యా నిందితుల ప్రశ్న

Will we be hanged or sent to life imprisonment Udaipur killers ask
  • తమకు ఏ శిక్ష పడుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి
  • విచారణాధికారులను అడుగుతున్నా నిందితులు
  • ఎన్ఐఏ కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసు నిందితులు తమను విచారిస్తున్న జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులను అడుగుతున్న ప్రశ్న ఒక్కటే. ‘‘ఈ నేరం చేసినందుకు మమ్మల్ని ఉరేస్తారా? లేక జీవిత ఖైదు విధించి జైలుకు పంపిస్తారా?’’ అని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు ఏ శిక్ష పడుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి వారిలో కనిపిస్తోంది. 

 మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టైలర్ కన్హయ్యలాల్ సమర్థించినందుకు.. రియాజ్ అత్తారీ, గౌస్ మహమ్మద్ జూన్ 28న గొంతు కోసం హత్య చేయడం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది. వీరిద్దరూ ఇప్పుడు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. వారి నుంచి దర్యాప్తు అధికారులు వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారు ఈ ప్రశ్నను పలు సార్లు అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News