తెలంగాణలో మరోసారి 500కి పైన కరోనా రోజువారీ కేసులు

05-07-2022 Tue 21:17
  • తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 25,913 కరోనా పరీక్షలు
  • 552 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 316 కొత్త కేసులు
  • ఇంకా 4,753 మందికి చికిత్స
Telangana corona cases update
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కరోనా రోజువారీ కేసుల సంఖ్య 500కి పైన నమోదైంది. గడచిన 24 గంటల్లో 25,913 కరోనా పరీక్షలు నిర్వహించగా, 552 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. హైదరాబాదులో అత్యధికంగా 316 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 51, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, సంగారెడ్డి జిల్లాలో 28 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 496 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదు కాలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,03,374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 7,94,510 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,753 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.