హిట్టు కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు: కృష్ణవంశీ

05-07-2022 Tue 19:38
  • కొంతకాలంగా హిట్స్ లేని కృష్ణవంశీ
  • కెరియర్ పరంగా వచ్చిన గ్యాప్ 
  • తాజాగా ఆయన నుంచి రానున్న 'రంగమార్తాండ'
  • ఎవరూ హిట్ సినిమాలు తీయలేరన్న కృష్ణవంశీ
Krishnavamsi
కృష్ణవంశీ నుంచి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. వినోదంతో పాటు సందేశంతో కూడిన సినిమాలు ఆయన నుంచి వచ్చాయి. కొంతకాలంగా ఆయనను వరుస పరాజయాలు పలకరించాయి. ఆ తరువాత చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి 'రంగమార్తాండ' సినిమా రాబోతోంది.

తాజా ఇంటర్వ్యూలో కృష్ణవంశీ మాట్లాడుతూ .. "హిట్టు కోసం నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. తీసిన తరువాత జనానికి నచ్చితే హిట్టు అవుతుందని భావించేవాడిని. హిట్టు సినిమానే చేయాలనుకుంటే, అప్పటికి హిట్ అయిన సినిమాల ఫార్మేట్ ను ఫాలో అయ్యేవాడిని కదా. 

ఇప్పుడు కూడా కావలసింది హిట్టే అనుకుంటే కమర్షియల్ సినిమా చేసేవాడినికానీ, 'రంగమార్తాండ' ఎందుకు తీస్తాను? నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఒక్కటే .. ఎవరూ హిట్ సినిమాలు చేయలేరు. తీసిన సినిమాలు అందరికీ నచ్చితే హిట్ అవుతాయంతే" అంటూ చెప్పుకొచ్చాడు.