ఏపీ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌... వ‌చ్చే నెల‌లో గ్రూప్-1, 2 నోటిఫికేష‌న్లు

05-07-2022 Tue 19:10
  • 2018 గ్రూప్-1 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన స‌వాంగ్‌
  • 110 పోస్టుల భ‌ర్తీ కోసం గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డి
  • 102 పోస్టుల‌తో గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ అన్న స‌వాంగ్‌
appsc will release group 1 and group 2 notificatikons next month
ఏపీలో నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2018లో నిర్వ‌హించిన గ్రూప్-1 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన రోజున‌నే మ‌రోమారు గ్రూప్‌-1తో పాటు గ్రూప్‌-2 పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేరకు మంగ‌ళ‌వారం 2018 గ్రూప్‌-1 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన ఏపీపీఎస్సీ చైర్మ‌న్ గౌతం స‌వాంగ్ గ్రూప్‌-1, 2 నోటిఫికేష‌న్ల‌పై ప్ర‌క‌ట‌న చేశారు.

ఆగ‌స్టులో విడుద‌ల కానున్న ఈ నోటిఫికేష‌న్ల ద్వారా భ‌ర్తీ చేసే పోస్టుల సంఖ్య‌ను కూడా స‌వాంగ్ వెల్ల‌డించారు. 110 పోస్టుల భ‌ర్తీ కోసం గ్రూప్ -1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న‌... 102 పోస్టుల భ‌ర్తీకి గ్రూప్‌-2 నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు.