'పొన్నియన్ సెల్వన్' నుంచి కార్తి లుక్!

05-07-2022 Tue 18:43
  • చారిత్రక చిత్రంగా 'పొన్నియన్ సెల్వన్'
  • మణిరత్నం కెరియర్లోనే భారీ బడ్జెట్ మూవీ 
  • రెండు భాగాలుగా రానున్న చిత్రం 
  • సెప్టెంబర్ 30వ తేదీన ఫస్టు పార్టు రిలీజ్ 
Ponniyan Selven Movie Update
ఒక వైపున ప్రేమ .. మరో వైపున సున్నితమైన సామాజిక అంశాలను కలుపుకుని మణిరత్నం కథలను తయారుచేసుకుంటూ ఉంటారు. సున్నితమైన భావోద్వేగాలకు ఆయున ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. అలాంటి ఆయన ఈ సారి ఒక బలమైన చారిత్రక అంశాన్ని కథగా రాసుకున్నారు. ఆ కథను భారీ ఖర్చుతో చెప్పడానికి సిద్ధమవుతున్నారు. 

చోళరాజుల కాలం నాటి ఒక కథను తీసుకుని ఆయన 'పొన్నియన్ సెల్వన్' సినిమాను తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో ఆయన కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు. ఈ కథను ఆయన రెండు భాగాలుగా చెప్పనున్నారు. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ప్రధానమైన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ వారి పోస్టర్లను వదులుతూ వస్తున్నారు. అలా తాజాగా కార్తి పోస్టర్ ను రిలీజ్ చేశారు. యుద్ధ వీరుడిగా కార్తి లుక్ ఆకట్టుకుంటోంది. ఇంకా విక్రమ్ .. జయం రవి .. ఐశ్వర్యారాయ్ .. త్రిష .. ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు.  ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది.