రామ్ తో డాన్సులంటే మాటలు కాదు: కృతి శెట్టి

05-07-2022 Tue 17:34
  • లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన 'ది వారియర్'
  • రామ్ సరసన నాయికగా నటించిన కృతి శెట్టి
  • ప్రతినాయకుడిగా ఆకట్టుకోనున్న ఆది పినిశెట్టి 
  • ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల
The Warrior Movie Update
టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్ లో కృతి శెట్టి మంచి దూకుడు మీద ఉంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఆమె, ఈ ఏడాదిలో మరో మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. ఆ సినిమాలలో ముందుగా థియేటర్లకు రావడానికి 'ది వారియర్' సినిమా ముస్తాబవుతోంది. రామ్ జోడీగా కృతి శెట్టి నటించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. "లింగుసామి గారి 'ఆవారా' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నుంచి కాల్ రాగానే నా ఆనందం అంతా ఇంతా కాదు. ఇక రామ్ డాన్స్ గురించి నాకు తెలుసు .. ఆయన స్పీడ్ ను అందుకోవడం కష్టమని చాలామంది చెప్పారు కూడా. ఆయనతో సీన్స్ ఈజీగానే చేశానుగానీ, పాటలనేసరికి భయం వేసింది. 

నిజంగానే రామ్ ఎనర్జీ లెవెల్స్ చూసి కంగారుపడిపోయాను. మొత్తానికి ఏదో ఫ్లోలో మ్యాచ్ చేయగలిగాను. ఇక ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ గా చేశారు. మా కాంబినేషన్లో సీన్స్ లేవు కానీ, సినిమా చూసిన తరువాత షాక్ అయ్యాను. చాలా కూల్ గా కనిపించే ఆయననేనా తెరపై కనిపిస్తున్నది అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.