పేరు మార్చుకున్న మెగాస్టార్ చిరంజీవి?

05-07-2022 Tue 17:19
  • తన పేరులో మరో E చేర్చిన చిరంజీవి
  • 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ లో CHIRANJEEEVI గా మార్పు
  • వీడియో ఎడిటింగ్ లో పొరపాటు జరిగిందన్న సన్నిహితులు
Chiranjeevi changed his name
మెగాస్టార్ చిరంజీవి తన పేరు మార్చుకున్నారు. తన పేరుకు మరో అక్షరాన్ని ఆయన జతచేసుకున్నారు. సినిమావాళ్లు న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారనే విషయం తెలిసిందే. తమకు లక్ కలిసిరావాలని తమ పేరును మార్పు చేసుకుంటుంటారు. ఇదే క్రమంలో చిరంజీవి కూడా తన పేరును మార్పు చేసుకున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు ఇంగ్లీషులో చిరంజీవి పేరు 'CHIRANJEEVI' అని ఉండేది. ఇప్పుడు దీనికి మరో 'E' జతచేసి... 'CHIRANJEEEVI' అని మార్చుకున్నారు.         

చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో 'Megastar Chiranjeevi' అని ఉండాల్సిన పేరులో 'Megastar Chiranjeeevi'గా ఉంది. ఒక న్యూమరాలజిస్ట్ సలహా మేరకు చిరు ఈ మార్పు చేసుకున్నారని చెపుతున్నారు. 

మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. చిరంజీవి పేరులో మార్పు చేసుకోలేదని.. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పొరపాటు జరిగిందని ఆయన సన్నిహితులు, సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పినట్టు సమాచారం. ఈ వార్తలపై చిరంజీవి అధికారంగా క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.